English | Telugu

మంచి సినిమాలు తియ్యండి.. చూడలేక ఛస్తున్నాం!

హీరోయిన్‌ మాధవీలత చాలా విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. అది తనకు అవసరమా లేదా అన్నది పక్కన పెట్టి ఘాటుగా స్పందించడం ఆమెకు బాగా అలవాటు. తాజాగా టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలపై తన కామెంట్స్‌తో విరుచుకుపడింది.సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ సీనియర్‌ హీరోలనే కాదు, వారి అభిమానులను సైతం హర్ట్‌ చేసేలా వుంది. అసలు మాధవీలత పెట్టిన ఆ పోస్టు సారాంశం ఏమిటో ఒకసారి చూద్దాం.

‘మన తెలుగు హీరోలు మారాలబ్బా.. రియల్‌ లైఫ్‌లో పెళ్లిళ్ళు అయిపోయి గాడిదలంత కొడుకులున్నా, 40 నుంచి 60 సంవత్సరాల వయసు వచ్చినా.. ఇంకా సినిమాల్లో పెళ్ళి కానీ కుర్రాడిలా వేషాలేస్తూ అమ్మాయిల వెంటపడి లైన్‌ వెయ్యడం చేస్తున్నారు., రొట్ట స్టోరీలతో సినిమాలు తియ్యడం మానేసి, కాస్త తమిళ్‌, మలయాళం మూవీస్‌ చూసి మంచి సినిమాలు తియ్యండి. చూడలేక ఛస్తున్నాం. ఇలాఅంటే వెర్రి ఫ్యాన్స్‌ ఎగబడతారు. దేవుడ్ని పూజిస్తే రాయికి పూజ అంటారు. స్క్రీన్‌లో తప్ప నిజజీవితంలో ఒక క్యారెక్టర్‌ లేని హీరోలకు మొక్కుతారు, మా హీరో తోపు అంటారు. గుడి కట్టి పూజ తప్ప అన్నీ చేస్తారు. ఇలా అంటే హీరోల అభిమానులకుఎంత కాలుతుందో, దేవుడు లేడు అంటే దేవుడ్ని నమ్మే మాకూ అంతే కాలుతుంది. మంచి సినిమాలు చెయ్యండి. తట్టెడు మేకప్‌ వేసినా 60, 70 సంవత్సరాల వయసుని 16 చెయ్యలేం. హీరోయిన్‌ వెంటపడే డ్యూయెట్స్‌ ఆపెయ్యండి. మంచి కాన్సెప్ట్స్‌ చెయ్యండి. దీనికి వెంకటేష్‌ మినహాయింపు అబ్బా‘ అంటూ ఘాటుగా తన కామెంట్‌ను పోస్ట్‌ చేసింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.