English | Telugu

అగ్ర దర్శకుడైన నా భర్త ఆ కారణంతోనే సినిమాలు చెయ్యడం లేదు

తమిళ చిత్ర రంగంలో ఆయన ఒక పేరు మోసిన దర్శకుడు. ఆయన దర్శకత్వం లో సినిమా వస్తుందంటే తమిళ సినిమా ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తారో తెలుగు సినిమా హీరోలు, దర్శకులు ,నిర్మాతలు అంత కంటే ఎక్కువగా ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమా తమిళనాడులో రిలీజ్ అవ్వగానే తెలుగులో ఆ సినిమా ఏ హీరోకి సరిపోతుందో అని దర్శక నిర్మాతలు, నాకు ఈ కథ సూటవుతుందా లేదా అని హీరోలు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తుండే వాళ్ళు. ఈ రోజు తమిళనాడు చిత్ర పరిశ్రమని ఏలుతున్న తలపతి విజయ్ ఆ దర్శకుడి సినిమాల్లో నటించే అగ్ర హీరో రేంజ్ కి వెళ్ళాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు విక్రమన్. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు. సూర్య అంటే పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అని. అలాగే విక్రమన్ అంటే పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్. తమిళంలో ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి రీమేక్ అయ్యి ఆయా హీరోల కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రాలుగా నిలిచాయి. తాజాగా విక్రమన్ భార్య చేసిన ఒక స్టేట్ మెంట్ దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమని ఒక కుదుపు కుదుపుతుంది.

తమిళ సినీ ప్రేక్షకులకి అలాగే తెలుగు సినీ ప్రేమికుల అందరికి విక్రమన్ గురించి తెలుసు. ఆయన సినిమా లు వాస్తవికతకి దగ్గరగా ఉండటంతో పాటు స్త్రీ యొక్క గొప్పతనాన్ని ,ప్రేమని,త్యాగాన్ని చాలా గొప్పగా చెప్తాయి. బహుశా అందుకనేనేమో తన భార్య కోసం దర్శకత్వానికే దూరంగా ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం విక్రమన్ భార్య జయప్రియ వెన్నునొప్పిగా ఉంటే హాస్పిటల్ కి వెళ్ళింది. సిటీ స్కాన్ చేసిన డాక్టర్స్ క్యాన్సర్ అని చెప్పి బయాప్సి చేసారు. ఆపరేషన్ కి అరగంటసేపు పడుతుందని చెప్పిన డాక్టర్స్ మూడున్నరగంటల కి పైగా చేసారు. ఆపరేషన్ జరిగిన తర్వాత ఒక పది రోజులు కనీసం నడవలేక పోయానని జయప్రియ చెప్పింది.
నెల రోజుల పాటు హాస్పిటల్ లో ఉన్న ఆవిడ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. ఆవిడకి మందులు ఇవ్వడానికి ఇద్దరు నర్సులు కూడా ఉంటున్నారు. డైలీ ఫిజియోథెరఫీ చెయ్యాలని నాకున్న రోగం పూర్తిగా నయం కాలేదని రోజు మందులు వాడాలని మంచం మీద నుంచి లేచే ప్రసక్తి కూడా లేదని అలాగే రెండుగంటలకొకసారి యూరిన్ బాగ్స్ కూడా వాడుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక ట్రీట్ మెంట్ కోసం నా భర్త ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేసాడని చాలా మంది సూర్యవంశం సినిమా కి సీక్వెల్ చెయ్యమని ఆయన్ని అడుగుతున్నా కేవలం నా ఆరోగ్యం గురించి ఆలోచించే ఆయన సినిమాలు చెయ్యటం లేదని చెప్తూ కన్నీరుమున్నీరు అవుతుంది.
తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన శుభాకాంక్షలు, సూర్యవంశం, మా అన్నయ్య, ఇలా ఎన్నో హిట్ సినిమాల ఒరిజినల్ మాతృకకి విక్రమన్ నే కథ,దర్శకత్వం వహించారు. అలాగే తెలుగులో చెప్పవే చిరుగాలి, వసంతం సినిమాలకి విక్రమన్ దర్శకత్వం వహించాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.