English | Telugu
ఆస్కార్ వేదికపై 'నాటు నాటు'!
Updated : Mar 1, 2023
'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ఆస్కార్ గెలుచుకుంటుందనే నమ్మకం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ 'ఆర్ఆర్ఆర్' మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.
మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో జరగనున్న 95వ ఆస్కార్ వేడుకల్లో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ 'నాటు నాటు' పాటని వేదికపై లైవ్ లో పాడి అలరించనున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్స్ టీం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఆస్కార్ వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నాటు నాటు పాటకి డ్యాన్స్ చేసే అవకాశముందని కూడా అంటున్నారు. మొత్తానికి దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని ఆస్కార్ వేదికపై తెలుగు పాట వినిపించనుంది.