English | Telugu
విజయ్ ‘లియో’ కోసం భారీ ప్లాన్
Updated : Sep 15, 2023
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తాజా చిత్రం ‘లియో’. వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కిస్తోన్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ మూవీని తెరకెక్కించారు. విజయ దశమి సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 19న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున్న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మేకర్స్ ఈ సినిమాను విజయ్ గత చిత్రాల కంటే ఎక్కువగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు విజయ్, లోకేష్ కనకరాజ్ సినిమాలపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలే కావు, ఇతర సౌత్ సినీ ఇండస్ట్రీస్‌తో పాటు బాలీవుడ్ సైతం ఆసక్తిగా గమనిస్తోంది. అయితే విజయ్ తన సినిమాల ప్రమోషన్స్ కోసం ఎక్కువగా బయట కనపడరు. ఇంటర్వ్యూ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రమే పాల్గొంటారు.
అందువల్ల ‘లియో’ ప్రీ రిలీజ్ కోసం మేకర్స్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. సాధారణంగా చెన్నై, దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనే విజయ్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా మలేషియాలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తే ఎలా ఉంటుందా? అని అనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ‘లియో’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు కారణం మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ సినిమా తెరకెక్కనుంది. మరోవైపు లోకేష్ కనకరాజ్.. రజినీకాంత్‌తో సినిమా చేయాల్సి ఉంది.
లియో చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. సంజయ్ దత్ విలన్‌గా నటించారు. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. ఎస్.ఎస్.లలిత్ కుమార్, జగదీష్ పళని స్వామి నిర్మాతలు.