English | Telugu

‘పులిమడ’ మూవీ రివ్యూ

మూవీ : పులిమడ
నటీనటులు: జోజు జార్జ్, ఐశ్వర్య రాజేశ్, చెంబన్ వినోద్ జోస్, లిజిమోల్ జోస్, జానీ ఆంటోనీ తదితరులు
ఎడిటింగ్: ఏకే సజన్
సినిమాటోగ్రఫీ: వేణు
మ్యూజిక్: అనిల్ జాన్సన్
నిర్మాతలు: దామోదరన్
దర్శకత్వం: ఏకే సజన్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్

మలయాళంలో రిలీజైన 'పులిమడ' మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది‌. జోజు జార్జ్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:

ఒక అడవిలో విన్సెంట్(జోజు జార్జ్) ఒంటరిగా ఉంటాడు. తన చిన్నప్పుడే నాన్న చనిపోతాడు. అమ్మ మానసిక రోగిగా ఉండి కొన్ని సంవత్సరాలకి చనిపోతుంది‌. విన్సెంట్ ఫారెస్ట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ఇక అతనికి తోడు కావాలని పెళ్లి సంబంధాల కోసం ఎంత చూసిన అన్నీ చెడిపోతుంటాయి. ఇక జెస్సీ అనే అమ్మయి ఒకే అని చెప్పడంతో పెళ్ళికి సిద్ధమవుతాడు విన్సెంట్. అయితే పెళ్ళి మరికొన్ని గంటల్లో ఉందనగా జెస్సీ ప్రేమించిన వ్యక్తితో లేచిపోతుంది. అది తెలుసుకున్న విన్సెంట్ బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని తాగుతుంటాడు. ఇక అదేస సమయంలో ఎమిలీ జార్జ్(ఐశ్వర్య రాజేశ్) ఎదురవుతుంది. తన కారు ట్రబుల్ ఇచ్చిందని తెల్లవారేదాకా ఆశ్రయం కావాలని కోరగా విన్సెంట్ ఒప్పుకుంటాడు. ఇక విన్సెంట్ ఇల్లు చూసిన ఎమిలీ.. ఇల్లంతా బాగా డెకరేట్ చేసి ఉండం గమనించి అన్నీ తెలుసుకుంటుంది. అలా విన్నెంట్, ఎమిలీ మధ్య మాటలు కలుస్తాయి. అయితే ఆ రాత్రి ఎమిలీ రక్తపు మడుగులో పడి ఉంటుంది. అది చూసి విన్సెంట్ భయపడిపోతాడు. ఎమీలీ ఎవరు? విన్సెంట్ కి పెళ్లి అయిందా? అసలు పులికి ఈ విన్సెంట్ పెళ్లికి మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

పులిమడ అంటే పులిగుహ అని అర్థం. ఈ మూవీలో విన్సెంట్ కి నలభై ఏళ్ళు నిండిన పెళ్ళి కాదు. ఇక అన్నీ కుదిరి పెళ్లి ఫిక్స్ అయితే అతనికి వచ్చిన అడ్డంకులేంటి, అసలు ఈ పులికి హీరోకు మధ్య సంబంధమేంటని చిన్న ప్లాట్ ని ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. సినిమాలో ఇంటెన్స్ సస్పెన్స్ ఎక్కడ కనపడలేదు. ప్రథమార్ధానికి ప్రేక్షకులకు ఇదేం సినిమారా బాబు అనిపిస్తుంది.

ఇక ద్వితీయార్థంలో కథలోకి వెళ్ళిన‌‌.. స్లో సీన్స్ ఎక్కువగా డిస్టబ్ చేస్తుంటాయి. కథనం స్పీడ్ లేకపోవడంతో ప్రేక్షకులకి డాక్యుమెంటరీ ఫిల్మ్ చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. నలభై ఏళ్ళు గడిచిన పెళ్ళి కాని విన్సెంట్ కి ఎమిలీ పరిచయం, వారి పెళ్ళి ఇదంతా బాగానే ఉన్నా సరైన ఎంగేజింగ్ సీన్ ఒక్కటి లేదనిపిస్తుంది‌. పులి కనపడే ఒక పది నిమిషాలు మాత్రం కాస్త సస్పెన్స్ ఫీల్ కలుగుతుంది. ఇక ఆ పది నిమిషాల పులి కనపడే సీన్ కోసం అందరు దానికోసం గాలించే సీక్వెన్స్ సాగుతూనే ఉంటుంది. ఎంతకీ దానిని కనిపెట్టకపోగా.. మరింత స్లోగా స్క్రీన్ ప్లే సాగుతుంది.

పులిగుహ అనే టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పెట్టారో.. సినిమా పూర్తిగా చూసిన ఏ ఒక్కరికి అర్థం కాదు. విన్సెంట్, ఎమిలీ పాత్రలు మినహా మిగతా పాత్రల ప్రాముఖ్యత లేకపోవడం.. బేసిక్ కథని సరిగ్గా చూపించే తీరులో డైరెక్టర్ విఫలమయ్యాడు. సినిమా నిడివి తక్కువే అయిన ప్రథమార్ధం ముగిసేసరికే చాలా టైమ్ చూసామనే భావన ప్రేక్షకుడిలో కన్పిస్తుంది. అడల్ట్ సీన్స్ కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడలేం. ఆకట్టుకునే కథాంశం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం ఈ సినిమాకి పెద్ద మైనస్. ఎడిటింగ్ పర్వాలేదు. బిజిఎమ్ అంతగా సెట్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

జోజు జార్జ్ పాత్ర సినిమాకి ప్రధాన బలం. ఐశ్వర్య రాజేశ్ గ్లామర్ రోల్ తో ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

పులిమడ చూడాలనుకుంటే కాస్త ఓపికతో పాటు సమయం కూడా కావాలి. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్.

రేటింగ్: 2 / 5

✍🏻. దాసరి మల్లేశ్

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.