English | Telugu
స్క్రీన్స్ మీదకు సర్దార్2
Updated : Jul 22, 2023
బిజియెస్ట్ లీడ్ యాక్టర్స్ లో విజయ్ సేతుపతి ఎప్పుడూ ముందుంటారు. తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు విజయ్ సేతుపతి. 2010లో కార్తి స్నేహితుడిగా నాన్ మహాన్ అల్ల అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత కార్తి, విజయ్ సేతుపతి కలిసి నటించలేదు. ఎవరికి వారు బిజీగా ప్రాజెక్టులు చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా కార్తితో మరోసారి విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నారనే మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కార్తి హీరోగా జపాన్ సినిమా తెరకెక్కుతోంది. దీపావళికి విడుదల కానుంది ఈ సినిమా. ఈ సినిమాలో ముందు విజయ్ సేతుపతిని విలన్ రోల్‌కి అనుకున్నారు. అయితే విజయ్ సేతుపతికి కాల్షీట్ కుదరకపోవడంతో, ఆ ప్లేస్‌లో తెలుగు హీరో సునీల్‌ని తీసుకున్నారు. జపాన్‌తో మిస్ అయిన కాంబోని, నెక్స్ట్ మూవీకి సెట్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.కార్తి హీరోగా నెక్స్ట్ సర్దార్2 తెరకెక్కనుంది. ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతిని అనుకుంటున్నారు మేకర్స్.
ఈ మూవీలో నటించడానికి సేతుపతి ఓకే చెప్పినట్టు సమాచారం. అగ్రిమెంట్ల మీద ఇంకా సంతకాలు చేయాల్సి ఉందట. ఇప్పటిదాకా విజయ్ కనిపించనటువంటి పాత్రను మేకర్స్ ఆయన కోసం డిజైన్ చేశారట. కార్తి హీరోగా తెరకెక్కింది సర్దార్. పి.యస్.మిత్రన్ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. 2022లో విడుదలై, బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది ఈ మూవీ. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు మిత్రన్. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తారు. సీక్వెల్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. విజయ్ సేతుపతి నటిస్తున్న జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. మెర్రీ క్రిస్మస్ డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.