English | Telugu

ధనుష్ 50వ సినిమా దర్శకుడు ఎవరో తెలుసా?

వాస్తవానికి రజనీకాంత్ సూప‌ర్ స్టార్ అయిన తర్వాత కూడా హీరో అంటే ఇలాగా కూడా ఉంటారా? అని కొందరు భావించారు. ఇక తరువాత ధనుష్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు హీరోలంటే కండలు తిరిగి ఉంటాయి. మరీ బక్కపల‌చగా, సన్నగా వంటిపై కండే లేని ఈయ‌న హీరో ఏంటి? అని వేళాకోళం ఆడిన వారు కూడా చాలామందే ఉన్నారు. స‌న్న‌గా అస్థిపంజ‌రంలాగా ఉండే ధనుష్ హీరో ఏమిట‌ని కొందరు వేళాకోలంగా మాట్లాడి ఆట‌ప‌ట్టించేవారు కూడా. కానీ వారందరికీ ధనుష్ తన నటనతో, త‌న‌లోని మల్టీ టాలెంట్ తో సమాధానం చెప్పారు. కాగా అతి తక్కువ కాలంలోనే ఈయన 50 చిత్రాలను పూర్తి చేయబోతున్నారు. తెలుగులో హీరోలు ఇన్నేళ్ల తమ కెరీర్లో 20, 30 సినిమాలు కూడా చేయలేక అవస్థలు పడుతూ ఉంటే ధనుష్ వరుసగా సినిమాలు చేస్తూ 50 చిత్రాలకు చేరుకోవడం విశేషమ‌నే చెప్పాలి. ఇక ఈయన రజనీకాంత్ తర్వాత హాలీవుడ్ చిత్రంలో నటించిన ఘనతను సాధించారు. బాలీవుడ్ లో కూడా రెండు మూడు చిత్రాలు చేశాడు.

తాజాగా ధనుష్ 50వ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంతో ధనుష్ నటుడిగా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయ‌న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో వాతిగా విడుదల కానుంది. ఆ వెంటనే టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టునున్నారు. మరోవైపు దిల్ రాజు నిర్మాతగా శ్రీకారం దర్శకుడు కిషోర్ తో ఓ చిత్రం చేయబోతున్న‌ట్లు స‌మాచారం. ఇక ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో మాఫియా నేపథ్యంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన గ్యాంగ్ లీడర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీలో సందీప్ కిషన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా ధనుష్ 50వ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి ధనుష్ తానే స్వీయ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తన కెరీర్లో మైలురాయి ఇలాంటి 50వ‌ సినిమాని వేరొక దర్శకునికి ఇవ్వకుండా ధనుష్ తనలోని మేకర్ ను బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం. ఈ సినిమా కూడా పీరియాడికల్ జోనర్ లోనే తెరకెక్కబోతున్నట్టు పోస్టర్ ని బట్టి అర్థమవుతుంది. ఈ పోస్ట‌ర్ లో బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్టరీల నుంచి వచ్చే భారీ పొగని ఎలివేట్ చేశారు. ఆ పరిసరాలు మురికివాడ‌లుగా ఉన్నాయి. దీన్నిబట్టి మురికివాడలో జరిగే కథాంశంగా ఈ మూవీ ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా ధ‌నుష్ కెరీర్ లోనే 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న సినిమా అంటే చిన్న విషయం కాదు అనే చెప్పాలి. మరి ఈ చిత్రంతో ధనుష్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు వేచి చూడాలి. ఇంకా ఈ సినిమాలో ఎస్ జె సూర్య, విష్ణు విశాల్ లు కూడా నటించనున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.