English | Telugu

96 దర్శకునితో కార్తీ సరి కొత్త మూవీ!

తమిళంలో 96 గా వచ్చిన చిత్రం అక్క‌డ ఎంత‌టి అపూర్వ‌మైన ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు జానుగా రీమేక్ చేశారు. దీనిలో శర్వానంద్, సమంతా నటించారు. 96 ఒరిజినల్ వర్షన్ తో పాటు తెలుగు జాను కూడా తమిళ దర్శకుడైన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ తీశారు.

ఇక కార్తీ విషయానికి వస్తే ఆయనకు తెలుగులో ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. సూర్య తమ్మునిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అతి తక్కువ చిత్రాలతోనే తన అందం, అభినయంతో సొంతగా ఇమేజిని తెచ్చుకున్నారు. ఆ క్రేజ్ తో ఆయన చిత్రాలకు తెలుగులో మంచి ఓపెనింగ్సే ఉంటాయి. ఇలా ఆయన నటించిన యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, శకుని, బ్యాడ్ బాయ్, బిర్యాని, మద్రాస్, కాష్మోరా, చెలియా, ఖాకీ, చిన్నబాబు, ఖైదీ, దొంగ, సుల్తాన్, పోనియన్ సెల్వ‌న్ 1, వీరబాబు, సర్దార్ వంటి చిత్రాలు వచ్చాయి. ఇక ఈయన తెలుగులో నేరుగా కింగ్ నాగార్జున తో కలిసి ఊపిరి చిత్రం చేశారు. కార్తీనటనతో పాటు ఆయన తన ఆటిట్యూడ్ తో కూడా అందరికీ నచ్చేస్తారు. గత ఏడాది మూడు హిట్లు కొట్టారు. ప్రస్తుతం జపాన్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయ‌న ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కథ బాగా నచ్చడంతో కార్తీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ట‌.

ఈ సినిమా సూర్య సొంత బ్యానర్ అయిన 2d ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని కూడా ప్రేమ్ కుమార్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తయారు చేసుకున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రంలో కార్తీ మధురై కి చెందిన వాడిగా కనిపించనున్నాడని, ఈ సినిమాకు జల్లికట్టు అనే పేరును కూడా ఖరారు చేశారు తెలుస్తోంది. మొత్తానికి ప్రేమ్ కుమార్ కార్తీతో తీయబోయే సినిమా 96 ని మించి ఉంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌నే కసితో ఉన్న డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఈ చిత్రంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారట.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .