English | Telugu
'దేవర'తో ఎన్టీఆర్ సంచలనం.. ఆల్ టైం రికార్డు!
Updated : Nov 21, 2023
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. జనవరి కల్లా షూటింగ్ పూర్తయ్యేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మూవీ టీం దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ కావడంతో 'దేవర' సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు నాలుగు నెలల ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. దేవర ఐదు భాషల(తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ) డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆల్ టైం రికార్డు ప్రైస్ కి దక్కించుకుందట. ఈ మొత్తం రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.