English | Telugu
లిటిల్ ప్రిన్సెస్ కి బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ
Updated : Nov 21, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలి లో జరిగే ప్రతి వేడుకని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకి తెలియచేస్తుంటాడు. పుష్ప 2 తో బిజీ గా ఉన్న బన్నీ తాజాగా పోస్ట్ చేసిన ఒక పిక్ అండ్ ఒక కోట్ సోషల్ మీడియాలో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
బన్నీకి ఒక కొడుకు ,కూతురు ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. ఈ రోజు బన్నీకూతురు అర్హ పుట్టిన రోజు. ఈ మేరకు అర్హ తో దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్ ని ఇనిస్టా లో షేర్ చేసిన అల్లు అర్జున్ హ్యాపీ బర్త్ డే మై లిటిల్ ప్రిన్సెస్ అని రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్ ని చూసిన సినీ,రాజకీయ క్రీడారంగానికి చెందిన పలువురు సెలెబ్రిటీలు, బన్నీ అభిమానులు అర్హ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.
అర్హ తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాలో చిన్నప్పటి జాహ్నవి పాత్రలో నటిస్తుందనే వార్తలు అయితే వస్తున్నాయి గాని మేకర్స్ నుంచి అధికారకంగా ఎలాంటి ప్రకటన రాలేదు .అర్హ గతంలో సమంత టైటిల్ రోల్ పోషించిన శాకుంతలంలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.