English | Telugu

పర‌మ వీర చ‌క్ర ఎఫెక్టేనా ఇది..??

దాస‌రి నారాయ‌ణ‌రావు అంటేనే సంచ‌ల‌నాల‌కు నెల‌వు. ఆయ‌న సినిమాలే కాదు, మాట‌లూ అంతే హీటు పుట్టిస్తుంటాయి. వెండి తెర‌పై - ఎన్నో ప్ర‌యోగాలు - ఇంకెన్నో అద్భుతాలు సృష్టించారు. అయితే.. ట్రెండుతో పాటు మారాల్సివ‌చ్చిన‌ప్పుడు మాత్రం.. మార‌లేదు. 150వ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించే ఉద్దేశంతో నంద‌మూరి బాల‌కృష్ణ‌ని క‌థానాయ‌కుడిగా ఎంచుకొని - ప‌ర‌మ‌వీర చ‌క్ర రూపొందించారు. బాల‌య్య - దాస‌రి కాంబినేష‌న్ అన‌గానే నంద‌మూరి అభిమానులు సంబ‌ర‌ప‌డ్డారు. మ‌రో బొబ్బిలి పులి అవుతుంద‌నుకొన్నారు. అయితే.. వారి అంచ‌నాల్ని ఈ సినిమా అందుకోలేక‌పోయింది. దారుణ‌మైన ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకొంది. ఈసినిమాకి క‌నీసం ప్రారంభ‌వ‌సూళ్లు కూడా లేకుండా పోయాయి. మ‌రో విచిత్రం ఏంటంటే... ఈ సినిమా శాటిలైట్ హ‌క్కులు ఇంత వ‌ర‌కూ అమ్ముడుపోలేదు. స్టార్ హీరోని పెట్టుకొని ఇప్ప‌టి ట్రెండ్‌కు అనుగుణంగా, అభిమానుల ఆశల్ని, అంచ‌నాల్ని అందుకొనే విధంగా సినిమా తీయ‌లేను - అనే విష‌యం దాస‌రికి రూఢీ అయిపోయింది. వ‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాపై ప‌ర‌మ‌వీర చ‌క్ర ఎఫెక్ట్ ప‌డింది. దాస‌రి - ప‌వ‌న్ ల కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి తాను కాకుండా మ‌రో ద‌ర్శ‌కుడ్ని ఎంచుకొనే ప్ర‌య‌త్నంలో ఉన్నారు దాస‌రి. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌న్న ఆశ ఉన్నా.. ఆ ప్ర‌యత్నాన్ని మానుకొన్నారు. ఈత‌రం అభిరుచుల‌కు అనుగుణంగా, మ‌సాలా ఐటెమ్స్ తో సినిమా చేయ‌లేను.. అని దాస‌రి సిన్సియ‌ర్‌గా ఒప్పుకోవ‌డం విశేషం. ఒక‌వేళ ప‌ర‌మ‌వీర చ‌క్ర‌, ఇటీవ‌ల వ‌చ్చిన ఎర్ర‌బ‌స్సు సినిమాలు హిట్ట‌యితే.. ప‌వ‌న్ సినిమాకి దాస‌రే ద‌ర్శ‌కుడైపోదురేమో..?? మొత్తానికి దాస‌రి - ప‌వ‌న్‌ల నుంచి ఓ మాస్ యాక్ష‌న్ సినిమా వ‌స్తుంద‌నేది మాత్రం రూఢీ అయ్యింది. మ‌రి ఆ సినిమా ఎలా ఉంటుందో?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.