English | Telugu

కష్టాల్లో మహేశ్ బ్యూటీ

పొడుగు, మంచి ఫిజిక్ ఉంటే సరిపోతుందా ఏంటి? కాస్తంత మేటరుండొద్దూ...! కృతి సనన్ చూస్తే ఇలాగే అనిపిస్తుంది మరి. మహేశ్ బాబు సినిమాతో ఎంట్రీ ఇస్తోంది అనగానే అమ్మడు ఎక్కడికో వెళ్లిపోతుందని తెగ హడావుడి చేశారు. తీరాచూస్తే కృతి కెరీర్లో ఒక్క హిట్టూ లేదు. దీంతో అమ్మడు ఐరెన్ లెగ్ అనే ముద్రవేసేశారు. మహేశ్ సరసన నటించిన వన్ ఫ్లాప్, బాలీవుడ్ లో నటించిన హీరోపంటి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పోనీ దోచెయ్ తో కాస్తైనా మనసు దోచుకుంటుందిలే అనుకుంటే అదీ లేదు. పైగా చైతూ సరసన కృతి అస్సలు బాగాలేదని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇక అమ్మడి కెరీర్ క్లోజ్ అని ఫిక్సైపోయారు. అయినా ఏమాత్రం నిరాశపడని కృతి...దృష్టంతా సెట్స్ పై ఉన్న దిల్ వాలే పైనే పెట్టిందట. వరుణ్ ధావన్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమా రిజల్ట్ కృతి కెరీర్ ని డిసైడ్ చేస్తుందనడంలో తప్పేం లేదు. ఈ సినిమా రిజల్ట్ లో ఏమాత్రం తేడా వచ్చినా మహేశ్ బ్యూటీ ఇక తట్టాబుట్టా సర్దేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయిన కృతి సనన్ పరిస్థితి బాలీవుడ్ ఎలా ఉంటుందో చూద్దాం.....

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.