English | Telugu

దాసరి అవార్డ్స్ అందుకున్న శ్రీకాంత్, బ్రహ్మానందం!

దివంగత దర్శకరత్నం డాక్టర్ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో దాసరి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ పలువురు సినీ దిగ్గజాల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, ముత్యాల సుబ్బయ్య, వి.వి.వినాయక్, సి.కల్యాణ్, అలీ, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో.. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, డాక్టర్ బ్రహ్మానందం, బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి, వంశీ రామరాజు, కళా జనార్దన్, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్, దివాకర్, పబ్లిసిటీ డిజైనర్ రాంబాబు, వి.ఎఫ్.ఎక్స్ చందు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ, కవిరత్న చింతల శ్రీనివాస్ తదితరులు దాసరి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణలో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులకు కూడా ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.

అలీ మాట్లాడుతూ "ఉత్తమ హీరోకి తన వంతుగా 50,000 పారితోషకం ఇస్తాను" అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ "దాసరి గారి పేరు మీద జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఉంటాను" అన్నారు. వి వి వినాయక్ మాట్లాడుతూ "రామ సత్యనారాయణ దాసరి గారి మీద ఉండే అభిమానంతో ప్రతి ఏటా ఇలా చేయటం అభినందనీయం" అన్నారు. సి కళ్యాణ్ మాట్లాడుతూ "మా తమ్ముడు రామ సత్యనారాయణ దాసరి గారిని గుర్తుంచుకుని ప్రతిభావంతులకి అవార్డ్స్ ఇవ్వటం చాలా ఆనందకరం" అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .