English | Telugu
లోకేష్ యూనివర్శ్‌లో హీరో విక్రమ్!
Updated : Jul 9, 2023
లోకేష్ కి పది చేతులున్నాయా? అనే అనుమానం వస్తోంది జనాలకు. రోజుకో హీరో పేరు లోకేష్ కాంబినేషన్‌లో వినిపిస్తోంది. ఆల్రెడీ కమల్, సూర్య, ప్రభాస్, రామ్‌చరణ్ పేర్లు లోకేష్ కనగరాజ్ లిస్టులో ఉన్నాయి. రజనీకాంత్ చివరి సినిమాను లోకేష్ డైరక్ట్ చేస్తారనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ లిస్టులోకి మరో ప్యాషనేట్ హీరో పేరు యాడ్ అయింది. ఆయన మరెవరో కాదు హీరో విక్రమ్.
చియాన్ విక్రమ్ దక్షిణ భారత సినిమాల్లో అత్యంత ప్రతిభావంతుడు. మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరుంది ఆయనకు. పా. రంజిత్‌తో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తంగళాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
మొన్నటిదాకా చింపిరి జుట్టు, గడ్డం, ముక్కెర, గోచీతో వెరైటీ లుక్కులో కనిపించిన విక్రమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. క్లీన్ షేవింగ్‌తో కనిపిస్తున్నారు.
ఈ గెటప్ ఏదైనా సినిమా కోసమేనా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతానికి ఆయన చేతిలో ఇమీడియేట్‌గా ప్రారంభం కావాల్సిన ప్రాజెక్ట్ అంటూ ఏమీ లేదు. అయితే మహావీర్ కర్ణ సినిమాను మళ్లీ స్టార్ట్ చేస్తారనే టాక్ మాత్రం వినిపించింది. అయితే దానికన్నా ముందే ఆయన లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఓ సినిమా చేస్తారనే టాక్ ఉంది.
అయితే ఈ సినిమాకు లోకేష్ డైరక్టర్ కాదు. స్క్రిప్ట్ రైటర్ మాత్రమే. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన మహేష్ బాలసుబ్రహ్మణ్యం డైరక్షన్ చేస్తారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లియో మూవీని నిర్మిస్తున్నారు లలిత్‌కుమార్. సేమ్ బ్యానర్‌లో విక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ను చియాన్ 62 అని పిలుస్తున్నారు.