English | Telugu

చిరు స్కెచ్ అదిరిందండోయ్‌

చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు, ఎవ‌రితో అనే సందిగ్థానికి మెగాస్టార్ దాదాపుగా తెర‌దించేశాడు. రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో ఓ అతిథి పాత్ర‌లో త‌ళుక్కున మెర‌వ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. దాంతో 150వ సినిమా ప్ర‌స్తావ‌న కొంత‌కాలం ప‌క్క‌న పెట్టిన‌ట్టైంది. సంఖ్యా ప‌రంగా చూస్తే.. చ‌ర‌ణ్ సినిమాలో గెస్ట్ రోలే చిరుకి 150వ సినిమా అవుతుంది. దాంతో చిరు 150వ సినిమాకి ఏ ప్రత్యేక‌తా లేకుండా పోయింద‌న్న‌ది అభిమానుల ఫీలింగ్‌. 150వ సినిమాతో హీరోగా మెరిసి, సంచ‌ల‌నాలు సృష్టించి, త‌మ అభిమాన హీరో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తాడ‌నుకొంటే.. ఇలా చేశాడేంటి అని వాళ్లూ ఫీల‌వుతున్నారు.

అయితే ఈ ఎత్తుగ‌డ వెనుక చిరు భారీ స్కెచ్ వేశాడు. అదెలా అంటే... చిరు 150వ సినిమాకి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అటు పూరి జ‌గ‌న్నాథ్‌, ఇటు వినాయ‌క్‌.... ఇద్ద‌రిలో ఎవ‌రితో ముంద‌డుగు వేసినా ఎక్స్ పెక్టేష‌న్స్ భారీ లెవిల్లో ఉంటాయి. ఈ ప‌రిస్థితుల్లో వాటిని అందుకోవ‌డం కూడా క‌ష్ట‌మే. దానికి తోడు చిరుని ఇప్పుడు హీరోగా ఆద‌రిస్తారా, చిరు సినిమాల్లోకి వ‌స్తే పూర్వ స్థాయిలో ఆద‌ర‌ణ ఉంటుందా, ఇది వ‌ర‌క‌టిలా రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయా, అనే అనుమానం ఉంది. దాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకొంటున్నాడు చిరు. అందుకే చ‌ర‌ణ్‌సినిమాలో `ట్రైల‌ర్‌` చూపించ‌బోతున్నాడు. చిరు రాక‌తో.. చ‌ర‌ణ్ సినిమా మైలేజీ పెరిగితే, చిరు స‌క్సెస్ అయిన‌ట్టే. చిరుని వెండి తెర‌పై చూడాల‌ని ప్రేక్ష‌కులూ కోరుకొంటున్న‌ట్టే. అప్పుడు త‌న 151వ సినిమాని గ్రాండ్ లెవిల్లో చేయొచ్చు. దానికి తోడు తాను కెమెరా ముందు ఇది వ‌ర‌క‌టిలా కంఫ‌ర్ట్‌గా ఉన్నాడా, లేదా అనేది కూడా ప‌రీక్షించుకోవ‌చ్చు. చ‌ర‌ణ్ సినిమాలో చిరుతో ఓ పాట చేయించాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. ఇంకేం... డాన్సుల విష‌యంలోనూ రిహార్స‌ల్స్ దొరికేసిన‌ట్టే. అంటే చిరు త‌న త‌దుప‌రి సినిమాకి చ‌ర‌ణ్ సినిమాని ఓ ట్రైల‌ర్‌గా వాడుకొంటున్నాడ‌న్న‌మాట‌.

అంతేనా అంటే ఇంకా ఉంది. ఈ 5 నిమిషాల పాత్ర కోసం చిరు రూ.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకు నిర్మాత కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే చిరు వ‌ల్ల ఈ సినిమాకి క‌నీసం రూ.20 కోట్ల అద‌న‌పు మార్కెట్ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి. ఆ లెక్క‌న చిరుకి రూ.5 కోట్లు ఇవ్వ‌డంలోనూ త‌ప్పులేదు. అంటే... చిరు ఒక్క అతిథి పాత్ర‌ని ఇన్ని ర‌కాలుగా ఉప‌యోగించుకొంటున్నాడ‌న్న‌మాట‌. చిరు తెలివైన‌వాడే సుమీ..!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.