English | Telugu
కృష్ణవంశీ సినిమాపై చెర్రీ స్పందన
Updated : Mar 5, 2014
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కన్యాకుమారిలో జరుపుకుంటుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర విశేషాల గురించి చరణ్ తెలియజేస్తూ... కృష్ణవంశీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉండి. ఆయనది అధ్బుతమైన ఎనర్జీ. నాకు శ్రీకాంత్ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి అని తెలిపాడు. ఇందులో చరణ్ ఒక ఎన్నారై పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసింది. ఈ పాత్ర కొత్తగా ఉండాలని చరణ్ తన హెయిర్ స్టైల్ కూడా మార్చేసాడు. కుటుంబకథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.