English | Telugu
ఇంద్రుడుగా రానున్న విశాల్
Updated : Mar 5, 2014
తమిళంలో విశాల్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగు డబ్బింగ్ ద్వారా విడుదల అయ్యి, మంచి విజయం సాధించాయి. అయితే తాజాగా విశాల్ హీరోగా నటిస్తున్న "నాన్ సిగప్పు మనితన్" తమిళ చిత్రాన్ని తెలుగులో "ఇంద్రుడు" పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఇందులో విశాల్ పాత్ర పేరు ఇంద్రన్. లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటించింది. విశాల్ ఫిల్మ్ ఫాక్టరీ, UTV మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఈనెల మార్చి 13న, చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేయనున్నారు.