English | Telugu
బాలయ్య సినిమా.. ఫొటోతో మేటర్ లీక్ చేసిన చాందిని చౌదరి!
Updated : Dec 7, 2023
'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో 'కలర్ ఫోటో' భామ చాందిని చౌదరి నటిస్తోంది.
షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని, సినిమా అవకాశాలు పొందిన చాందిని.. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా 'కలర్ ఫోటో' చిత్రం ఆమెకి ఎంతో పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన 'గామి'లో నటిస్తున్న ఆమె.. ఇప్పుడు బాలయ్య సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
'NBK 109'తో చాందిని నటిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా సెట్స్ లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది చాందిని. సెట్స్ లో దర్శకుడు బాబీతో దిగిన ఫొటోలను షేర్ చేసిన ఆమె.. తాను 'NBK 109'లో నటిస్తున్నట్లు చెప్పకనే చెప్పేసింది.