English | Telugu

లైపోసెక్షన్ చేయించుకుంటున్న చక్రి

శరీరం అదుపులేనంతగా బరువు పెరిగితే "బ్రతుకంత బాధగా కన్నీటి గాధగా" అని పాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం తెలుగు సంగీత దర్శకుడు చక్రి పరిస్థితి అలాగే ఉంది. అంటే చక్రి శరీరం విపరీతంగా బరువు పెరిగి ఆఖరికి తన పనులు తాను చేసుకోటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడట చక్రి. అందుకని లైపోసెక్షన్ చేయించుకుని తన బరువు తగ్గించుకోవటానికి చక్రి సన్నాహాలు చేస్తున్నాడు.


ఆ ప్రయత్నంలో భాగంగా గ్లోబల్ హాస్పిటల్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ లైపోసెక్షన్ చేయటంలో అనుభవజ్ఞులని వారి వద్దకు వెళ్ళి ఈ లైపోసెక్షన్ గురించి వాకబుచేశాడు చక్రి. ఈ లైపోసెక్షన్ గతంలో "యమదొంగ" చిత్రం ముందు జూనియర్ యన్ టి ఆర్, "సలీమ్‍" చిత్రం ముందు విష్ణువర్థన్, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేయించుకున్నారు. అంటే త్వరలో భవిష్యత్తులో చక్రిని మనం సన్నగా చూడవచ్చు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.