English | Telugu

వివిల్ డబ్బింగ్ లో మహేష్ బాబు

మహేష్ బాబు వివిల్ షాపూకి మన ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అందుకు గాను వివిల్ యాడ్ ని పూర్తి చేసిన మహేష్ బాబు, ఆ యాడ్ కి డబ్బింగ్ కూడా ఇటీవల చెప్పారు. మహేష్ బాబు చేసిన ఈ వివిల్ షాంపూ యాడ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. తెలుగులో మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని వివిల్ షాంపూ కంపెనీ మహేష్ బాబుతో ఈ యాడ్ చేయించటానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. గతంలో మహేష్ బాబు థంమ్సప్, ప్రొవోగ్, యూనివర్సెల్, నవరత్న హెయిర్ ఆయిల్, అమృతాంజన్ పెయిన్ బామ్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆరవ కంపెనీ ఈ వివిల్ షాంపూ. ఈ వివిల్ షాంపూకి బాలీవుడ్ లో కరీనా కపూర్, అమృతా రావ్, హృతిక్ రోషన్ తదితరులు బ్రాండ్ అంబాసిడర్ లుగా పనిచేశారు. తెలుగులో మాత్రం వివిల్ షాంపూకి మహేష్ బాబు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. మహేష్ బాబు చేసిన ఈ వివిల్ షాంపూ యాడ్ త్వరలో మనకు కనువిందు చేయనుంది. భవిష్యత్తులో మహేష్ బాబు ఈ వివిల్ యాడ్ తో పాటు ఇంకెన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడో వేచి చూడాలి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.