English | Telugu

కోట్ల నుండి లక్షలకి పడిపోయిన 'బ్రో' గ్రాస్.. లాస్ రేంజ్ ఎంతుండొచ్చు!?

పవన్ కళ్యాణ్ 'బ్రో' మొత్తానికి రెండోవారంలోకి ఎంటరైంది. అదే సమయంలో.. తొలివారం ముగిసే సమయానికి రూ. కోట్లలో ఉంటూ వచ్చిన గ్రాస్ కాస్త.. రెండో వారం మొదటి రోజుకి రూ. లక్షలకి పడిపోయింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న సినిమా అయినా.. ఈ స్థాయికి వసూళ్ళు పడిపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. సెకండ్ వీక్ లో తొలి రోజైన నిన్న (ఆగస్టు 4) కేవలం రూ. 80 లక్షల గ్రాస్ తో సరిపుచ్చుకోవడం చూస్తే.. 'బ్రో' బ్రేక్ ఈవెన్ ఇక గగన కుసుమమన్నది పరిశ్రమ వర్గాల మాట. షేర్ విషయానికి వస్తే.. ఎనిమిదో రోజు కేవలం రూ. 41 లక్షలు ఉండడం గమనార్హం. ఇదే ట్రెండ్ కొనసాగితే.. రూ. 97 కోట్ల షేర్ టార్గెట్ తో బాక్సాఫీస్ ముంగిట నిలిచిన 'బ్రో'.. రూ. 25 కోట్లు - రూ.30 కోట్ల వరకు నష్టాలు చూసే అవకాశముందంటున్నారు ట్రేడ్ పండితులు.

తొలి రోజు నుంచి ఎనిమిదో రోజు వరకు 'బ్రో' వసూళ్ళను గమనిస్తే..

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.01 కోట్ల షేర్ రాబట్టిన 'బ్రో'.. రెండో రోజు రూ. 12. 32 కోట్ల షేర్, మూడో రోజు రూ. 12. 93 కోట్ల షేర్ ఆర్జించింది. ఇక నాలుగో రోజైన సోమవారం రూ. 2.96 కోట్ల షేర్, ఐదో రోజైన మంగళవారం రూ. 2. 20 కోట్ల షేర్, ఆరో రోజైన బుధవారం రూ. 1.84 కోట్ల షేర్, ఏడో రోజైన గురువారం రూ. 95 లక్షల షేర్ రాబట్టింది. ఇక ఎనిమిదో రోజైన శుక్రవారం రూ. 41 లక్షల షేర్ ఆర్జించింది. మొత్తంగా.. ఎనిమిది రోజుల్లో రూ. 63. 62 కోట్ల షేర్ (రూ. 106. 60 కోట్ల గ్రాస్) ఆర్జించింది 'బ్రో'. మరి.. వర్కింగ్ డేస్ లో అనుకున్నంతగా రాణించలేకపోయిన 'బ్రో'.. శని, ఆది వారాల్లోనైనా పుంజుకుంటుందేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.