English | Telugu
‘చంద్రముఖి 2’ నుంచి కంగనా ఫస్ట్ లుక్.. జ్యోతికని మరిపించేనా!
Updated : Aug 5, 2023
'చంద్రముఖి'.. దక్షిణాది సినీ ప్రియులకు హారర్ కామెడీ జానర్ ని పరిచయం చేసిన చిత్రం. సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా.. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కట్ చేస్తే.. 18 ఏళ్ళ తరువాత 'చంద్రముఖి'కి సీక్వెల్ గా 'చంద్రముఖి 2' పేరుతో మరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు పి. వాసు.
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇందులో టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనుంది. తాజాగా కంగనా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె లుక్ మెస్మరైజ్ చేసేలా ఉందని చెప్పొచ్చు. మరి.. ఫస్ట్ లుక్ లో ఇంప్రెస్ చేసిన కంగనా.. జ్యోతికను మరిపిస్తుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో సందడి చేయనున్న 'చంద్రముఖి 2'లో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందిస్తున్నాడు.