English | Telugu
'భగవంత్ కేసరి' ఫస్ట్ రివ్యూ.. ఇంటర్వెల్ సీన్ కి పూనకాలే!
Updated : Oct 13, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఇద్దరూ ట్రాక్ మార్చి విభిన్న తరహా సినిమాతో వస్తుండటంతో 'భగవంత్ కేసరి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
'భగవంత్ కేసరి' తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా అదిరిపోయింది అంటున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' సినిమాలతో వరుస విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని చెబుతున్నారు. బాలయ్య పాత్రని అనిల్ రావిపూడి అద్భుతంగా మలిచాడట. ముఖ్యంగా బాలయ్య రెండో గెటప్ లో ఉండే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయట. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే సినిమాకే హైలైట్ అని అంటున్నారు. బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ సీన్ పూనకాలు తెప్పించేలా ఉంటుందట. ఇక ఈ సినిమాలో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉందట. 'అఖండ' తర్వాత మరోసారి థమన్ విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు.