English | Telugu
50 రోజులు పూర్తి చేసుకున్న 'భగవంత్ కేసరి'.. బాలయ్య రేర్ రికార్డు!
Updated : Dec 7, 2023
ఈరోజుల్లో సినిమాలు రెండు మూడు వారాలు ఆడటమే గొప్ప విషయం. అలాంటిది నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలు మాత్రం అర్ధశత దినోత్సవం జరుపుకొని ఆశ్చర్యపరుస్తున్నాయి. బాలయ్య గత చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి' పలు సెంటర్లలో 50 రోజులు ఆడాయి. ఇప్పుడు అదే బాటలో 'భగవంత్ కేసరి' పయనించింది.
బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఇటీవల ఓటీటీలో అందుబాటులోకి వచ్చి, అక్కడా సంచలనాలు సృష్టిస్తోంది. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నప్పటికీ.. ఈ సినిమా 15 సెంటర్లలో అర్ధశత దినోత్సవం జరుపుకుంటోంది. అందులో 11 డైరెక్ట్ సెంటర్లు కాగా, నాలుగు షిఫ్ట్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ 50 డేస్ సినిమాలున్న హీరో బాలయ్యనే కావడం విశేషం.
భగవంత్ కేసరి 50 రోజుల సెంటర్ల వివరాలు:
డైరెక్ట్:
1. మదనపల్లి - కృష్ణా
2. హిందూపురం - గురునాథ్
3. ధర్మవరం - వరలక్ష్మీ
4. తాడిపత్రి - సాయితేజ
5 . కర్నూలు - ఆనంద్ స్క్రీన్3
6. నంద్యాల - రామనాథ్
7. ఆళ్లగడ్డ - మినీ శ్రీరామ్
8. జమ్మలమడుగు - TPR
9. చిలకలూరిపేట - రామకృష్ణ
10. ఏలూరు - సత్యనారాయణ స్క్రీన్1
11. గాజువాక - కన్య
షిఫ్ట్:
12. గుంతకల్లు - వాసవి
13. అనంతపురం - గంగ
14. ఎమ్మిగనూరు - శ్రీనివాస
15. ఖమ్మం - KPS