English | Telugu

పూరీ, అమితాబ్ బుడ్డా ప్రీమియర్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో

పూరీ, అమితాబ్ బుడ్డా ప్రీమియర్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో జరుగనుంది. వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓల్డ్ ఏజ్డ్ యాంగ్రీ మ్యాన్ గా, అంటే హీరోగా నటిస్తూండగా, హేమమాలిని, రవినా టాండన్, ఛార్మి, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సోనూ సూద్ ముఖ్య తారాగణంగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం"బుడ్డా". ఈ "బుడ్డా" చిత్రానికి "హోగా తేరా బాప్" అన్న క్యాప్షన్ నిర్ణయించారు. ఈ "బుడ్డా" చిత్రం ట్రైలర్స్ సంచలనం సృష్టిస్తూ, ఈ "బుడ్డా" చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఉత్సుకతను ప్రేక్షకుల్లో కలిగిస్తున్నాయి.

ఈ "బుడ్డా" సినిమాలో అమితాబ్ పాత్ర చాలా వెరైటీగా ఉందనీ, అదే ఆయనకు బాగా నచ్చిందనీ వినికిడి. అంతే కాకుండా పూరీ జగన్నాథ్ పనిచేసే విధానం కూడా అమితాబ్ ప్రశంసలు అందుకుంది. ఈ "బుడ్డా" చిత్రం జూలై ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుండగా, ఈ "బుడ్డా" చిత్రం ప్రీమియర్ షో హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్లలో జూన్ 30 వ తేదీ రాత్రి, 5 షోలు వేయటం జరుగుతూంది. రాత్రి 10, 10.30, 10.45, 11, 11 గంటలకు ఈ అయిదు షోలు వేయటం జరుగుతూంది. ఈ ప్రీమియర్ షోకి అమితాబ్‍ బచ్చన్ కూడా వస్తూండటం విశేషం.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.