English | Telugu

నటుడిగా మారనున్న మరో రచయిత కోన వెంకట్

నటుడిగా మారనున్న మరో రచయిత కోన వెంకట్ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఢీ, రెడీ వంటి సూపర్ హిట్‍ చిత్రాలకు కథలనందించిన, ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ త్వరలో నటుడిగా వెండితెర మీద కనిపించబోతున్నాడు. స్రవంతీ మూవీస్ పతాకంపై, చురుకైన యువ హీరో రామ్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "తొలిప్రేమ"ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న సినిమా "ఎందుకంటే ప్రేమంట".

ఈ సినిమాకి కోన వెంకట్ కథ, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాతోనే కోన వెంకట్ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారు. ఈ సినిమాలో కోన వెంకట్ విలన్ గా నటించనున్నారు. దీనిమీద కోన వెంకట్ స్పందిస్తూ "ఎక్కడో బాలీవుడ్ నుండో లేక తమిళ, మళయాళ, కన్నడ సినీ పరిశ్రమల నుండో విలన్లను దిగుమతి చేసుకోకుండా తెలుగు వ్యక్తే విలన్ గా నటిస్తే నిర్మాతలకు సౌకర్యవంతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అందుకే నటించాలని నిర్ణయం తీసుకున్నాను.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.