English | Telugu

హరికృష్ణను ఓదార్చిన బాలయ్య


రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి జానకిరామ్‌ బౌతికకాయన్ని నందమూరి బాలకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. ఆదివారం ఆయన సతీమణి వసుంధరతో కలిసి హరికృష్ణ ఇంటికి చేరుకున్న బాలయ్య అన్నను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అనంతరం జానకీరామ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. జానకిరామ్‌ బౌతికకాయన్ని చూసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.


రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి జానకిరామ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్‌, దర్శకుడు రాఘవేంద్ర, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీప్రణీత, లక్ష్మీపార్వతి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు జానకిరామ్‌కు పూలమాల వేసి నివాళులర్పించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.