English | Telugu
‘జైలర్’లో బాలకృష్ణ కానీ....
Updated : Aug 12, 2023
సూపర్‌స్టార్ లేటెస్ట్ మూవీ ‘జైలర్’. ఆగస్ట్ 10న రిలీజైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టుకుంటోంది. ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు అటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. ఇటు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించారు. అభిమానులకు ఇది కన్నుల పండుగగా అనిపించింది. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఏ స్టార్ హీరోను ఎందుకు నటింప చేయలేదనే సందేహం చాలా మందిలో కలిగింది. అయితే అందుకు సమాధానం కూడా నెల్సన్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఇచ్చేశారు.
అసలు టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణను గెస్ట్ రోల్‌లో నటింప చేయాలని నెల్సన్ భావించారు. అది కూడా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌లో అయితే ఆయనకు సంబంధించిన క్యారెక్టర్‌ను డిజైన్ చేయటానికి ప్రయత్నించినప్పటికీ అది ఆశించినట్లు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ నెల్సన్ ఆశించినట్లు బాలయ్య పాత్ర డిజైన్ కుదిరి ఉండుంటే సౌత్ ఇండస్ట్రీకి సంబంధిచిన సూపర్‌స్టార్స్ అందరూ కలిసి నటించిన సినిమా ఇదే అయ్యుండేది. కచ్చితంగా ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌లా ఉండేది. బీస్ట్ వంటి డిజాస్టర్ తర్వాత నెల్సన్ ‘జైలర్’ సినిమాను ఎలా తెరకెక్కిస్తారోనని తలైవా ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే సూపర్ స్టార్ ఇమేజ్‌ను మరింత పెచ్చేలా ఆయన ఏజ్‌కు తగ్గట్టు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి సినిమాను డైరెక్ట్ చేసిన నెల్సన్‌ను ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భగవంత్ కేసరి చిత్రం దసరా సందర్బంగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. అఖండ, వీరసింహా రెడ్డి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలకృష్ణ చేస్తోన్న సినిమా కావటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.