English | Telugu

'భోళా శంకర్' నైజాం, ఆంధ్రా ఫస్ట్ డే కలెక్షన్స్.. మెగాస్టార్ రేంజ్ కాదబ్బా!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్'. కోలీవుడ్ మూవీ 'వేదాళమ్' ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాని మెహర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 11) జనం ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది.

ఇదిలా ఉంటే, మొదటి రోజు నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో 'భోళా శంకర్'కి సంబంధించి వసూళ్ళు వెలుగులోకి వచ్చాయి. నైజాం ప్రాంతంలో రూ. 4.51 కోట్ల షేర్ ఆర్జించగా.. ఆంధ్రాలో రూ. 10.87కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ సమాచారం. అంటే.. తెలుగు రాష్ట్రాల్లోరూ. 15.38కోట్ల షేర్ వరకు వచ్చిందన్నమాట. ఏదేమైనా.. మెగాస్టార్ రేంజ్ కి తగ్గ ఓపెనింగ్స్ కాదనే చెప్పాలి. మరి.. వీకెండ్ తోపాటు పంద్రాగస్టు సెలవు దినంలో 'భోళా శంకర్' ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.