English | Telugu

లెజెండ్ కోసం కొట్టేసుకున్నారు

బాలకృష్ణ నటించిన "లెజెండ్" సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇటీవలే విజయ యాత్ర ముగించుకొని వచ్చింది. నిన్న విజయోత్సవాన్ని హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. చిత్ర బృందానికి బాలకృష్ణ జ్ఞాపికలను అందజేసారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ...'ఉగాది సంబరాలను రెట్టింపు చేసిన సినిమా ఇది. "సింహ" తర్వాత మా కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఓ సవాలుగా తీసుకున్నాం. మన పరిశ్రమలో నిజమైన హిట్ వచ్చి చాలా కాలమైంది. అందుకే పరిశ్రమ కూడా మా చిత్రం విజయం సాధించాలని కోరుకుంది. సినిమాకు "లెజెండ్" అనే పేరు పెట్టడమే పెద్ద సవాలు. చాలా మందికి లెజెండ్ అనే పదానికి అర్థం తెలియలేదు. కొంతకాలం క్రితం దీనిపై వివాదం కూడా రేగింది. లెజెండ్ ఎవరూ అంటూ కొట్టుకొని ఈ పదానికి ప్రాచుర్యం పెంచారు. కానీ నిజమైన లెజెండ్ అంటే ఏమిటో... ఎలా ఉంటాడో మా సినిమాలో చూపించాము" అని అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.