English | Telugu

లవ్ గురు గలాట

శ్రీ హీరోగా నటించిన తాజా చిత్రం "గలాట". ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందులో నేను లవ్ గురుగా కనిపిస్తాను. కానీ నా పెళ్లి దగ్గరే అసలు సమస్య ఏర్పడుతుంది. నేను చేసుకోబోయే అమ్మాయి ముందు మా బామ్మకి నచ్చాలి. అలాంటి లక్షణాలున్న అమ్మాయిని వెతుకుతూ ముంబాయి నుండి హైదరాబాదు వస్తాను. అక్కడ నాకు ఆండాళ్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఇక నాకు అక్కడి నుండి కష్టాలు మొదలవుతాయి. ఆ కష్టాలు ఏమిటి అనేదే కథ. ప్రతి ఒక్కరు హాయిగా నవ్వుకునేలా దర్శకుడు తీర్చి దిద్దారు. అందరికి ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.