English | Telugu

హరికృష్ణ 'స్వామి'కి రీమేక్ గా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'?

నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గార‌పాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నేలకొండ భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ పాత్ర బాలయ్య పోషిస్తుండగా.. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నందమూరి హరికృష్ణ నటించిన 'స్వామి' చిత్రానికి రీమేక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

చేసింది తక్కువే సినిమాలే అయినప్పటికీ నటుడిగా తన ప్రత్యేకను చాటుకున్నారు హరికృష్ణ. ఆయన టైటిల్ రోల్ ప్లే చేసిన 'స్వామి' అనే చిత్రం 2004 లో విడుదలైంది. వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, ఉమ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. తన కవల చెల్లెళ్లను ప్రేమ పేరుతో మోసం చేసి, హత్య చేసిన వ్యక్తిపై అన్నయ్య ఎలా పగ తీర్చుకున్నాడు కథతో ఈ చిత్రం రూపొందింది. 19 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా కథనే కొద్దిగా మార్పులు చేసి భగవంత్ కేసరి చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మేకర్స్ చెప్పారు. 'ఈ వార్తల్లో నిజం లేదు.. అసలు నిజం ఏంటంటే అక్టోబర్ 19న బిగ్ స్క్రీన్స్ పై అసలుసిసలైన సెలబ్రేషన్ చూస్తారు' అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు మేకర్స్.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' సినిమాలతో వరుసగా రెండు విజయాలు అందుకున్న బాలయ్య.. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు బలంగా నమ్మతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.