English | Telugu
Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న పవర్ స్టార్ సెంటిమెంట్...
Updated : Nov 8, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు గత 12 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అతడు, ఖలేజా లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ కల్ట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. పుష్కర కాలం తర్వాత హిట్ లోటుని తీర్చడానికి, సినీ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మహేష్ అండ్ త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ప్రొడ్యూస్ చేస్తున్న గుంటూరు కారం సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారి అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబుని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల నుంచి పక్కా మాస్ సినిమాల వైపు తీసుకోని వస్తూ త్రివిక్రమ్ మ్యాజిక్ చేస్తున్నాడు.
జస్ట్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తోనే మాస్ అంటే ఏంటో చూపించిన త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు... లేటెస్ట్ గా ధమ్ మసాలా సాంగ్ తో గుంటూరు కారం సినిమా ఏ రేంజ్ మాసీగా ఉండబోతుందో చూపించింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ 15 మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది. ఘట్టమనేని ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో వింటున్న ఈ సాంగ్ దెబ్బకి సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. జనవరి 12న గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఒక లెక్క మాత్రం మహేష్ అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.
గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ నవంబర్ 7న రిలీజ్ అయ్యింది, సరిగ్గా ఇదే రోజున 2018 నవంబర్ 7న అజ్ఞాతవాసి సినిమా నుంచి మొదటి సాంగ్ బయటకి వచ్చింది. గుంటూరు కారం సినిమాలాగే అజ్ఞాతవాసి సినిమా కూడా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూనే రిలీజ్ అయ్యింది. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనగానే అజ్ఞాతవాసి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి కానీ సినిమా రిజల్ట్ మాత్రం నేలని తాకింది. ఇప్పుడు అదే త్రివిక్రమ్, అదే ప్రొడక్షన్ హౌజ్, అదే డేట్ ని సాంగ్ అండ్ సినిమా రిలీజ్ అవ్వడం ఒక వర్గంలో అందలోన కలిగిస్తుంది. మరి జనవరి 12న మహేష్ ఆ భయాన్ని పోగొడుతూ రీజనల్ బాక్సాఫీస్ కింగ్ గా నిలబడతాడో లేదో చూడాలి.