English | Telugu
Anushka: 'మెగా 156' నుంచి అనుష్క అవుట్.. తన 50వ సినిమా ఏంటో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
Updated : Nov 8, 2023
లేడీ సూపర్ స్టార్ అనుష్కకి ఉన్న ఇమేజ్ అండ్ మార్కెట్ మీడియమ్ రేంజ్ యంగ్ స్టార్ హీరోలకి కూడా ఉండదు. అనుష్క పోస్టర్ పైన కనిపించగానే టికెట్స్ సెంటర్ తో సంబంధం లేకుండా తెగుతాయి. ఆ రేంజ్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న అనుష్క... ఇటివలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకుంది. బాగా గ్యాప్ తీసుకోని సినిమాలు చేస్తున్న అనుష్క, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తుంది అనే న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా వశిష్టతో చేస్తున్నాడు. ముల్లోకాల చుట్టూ తిరిగే ఫాంటసీ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
ఇటివలే మ్యూజిక్ సిట్టింగ్ తో ఈ సినిమా పనులు స్టార్ట్ అయ్యాయి. విశ్వంభర అనే టైటిల్ ని ఈ సినిమాకి లాక్ చేసినట్లు సమాచారం. విశ్వంభర సినిమాలోనే చిరు పక్కన అనుష్క హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజమేనేమో అనుకునే లోపు... అనుష్క, చిరు సినిమాలో నటించట్లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అనుష్క తన 50వ సినిమాని ప్లాన్ చేస్తోందట. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ భాగమతి 2 అయ్యే అవకాశం ఉందని సమాచారం. అనుష్క గతంలో భాగమతి సినిమా చేసింది, ఆమె కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ కి ఫ్లాష్ ఉందంటూ హింట్ ఇచ్చారు. అక్కడి నుంచే సీక్వెల్ ప్లాన్ చేస్తూ భాగమతి 2కి యువీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అనుష్క నుంచి మరో సాలిడ్ లేడీ ఓరియెంటెడ్ సినిమా పడినట్లే.