English | Telugu
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!
Updated : Dec 4, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు 'సలార్' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి భాగం 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర సంచనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు వారికో బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
'సలార్' విడుదలకు ఇంకా 20 రోజులు కూడా లేదు. ఈ పాటికే ప్రమోషన్స్ లో జోరు పెంచాల్సి ఉంది. కానీ మూవీ టీం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సహా ఎలాంటి అవుట్ డోర్ ఈవెంట్ ఉండదట. కొన్ని ప్రీ రికార్డెడ్ ఇంటర్వ్యూలను విడుదల చేస్తారట. ఆ ఇంటర్వ్యూలలో కూడా ప్రభాస్ కాకుండా ఇతర మూవీ టీం పాల్గొంటారట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే సినిమా విడుదలకు వారం ముందు మాత్రం మరో ట్రైలర్ రిలీజ్ చేస్తారట. 'సలార్'పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. మరి మేకర్స్ ప్రమోషన్స్ అంతగా చేయనప్పటికీ, రెండో ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయేమో చూడాలి.