English | Telugu

'కేజీఎఫ్ 2'ని బీట్ చేసిన 'బేబి'.. 'ఆర్ ఆర్ ఆర్' తరువాతి స్థానం

చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద చిత్రాల స్థాయిలో వసూళ్ళ వర్షం కురిపిస్తోంది 'బేబి' మూవీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. జూలై 14న జనం ముందు నిలిచింది. మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న 'బేబి'.. వీకెండ్ లోనే కాదు వీక్ డేస్ లోనూ బాక్సాఫీస్ ముంగిట కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు కొత్త చిత్రాలు పలకరిస్తున్నా.. మరోవైపు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నా సంచలనాలు సృష్టించడంలో 'బేబి' ఏ మాత్రం తగ్గడం లేదు.

'బేబి' హవా ఏ స్థాయిలో ఉందంటే.. తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల పాటు కంటిన్యూగా రూ. కోటికి తక్కువ కాకుండా షేర్ వసూళ్ళు చూసిన సినిమాల్లో రెండవ చిత్రంగా నిలిచింది. కరోనా తరువాత 17 రోజుల పాటు ఇలా రూ. కోటికి తక్కువ కాకుండా కాసులు కురిపించిన సినిమాగా 'ఆర్ ఆర్ ఆర్' పేరిట రికార్డు ఉంటే.. తరువాతి స్థానంలో 'బేబి' విడుదల ముందు వరకు 'కేజీఎఫ్ 2' ఉంది. అయితే 'కేజీఎఫ్ 2'కి 12 రోజుల పాటు ఆ రికార్డు ఉంటే.. తాజాగా 'బేబి' 13వ రోజు కూడా ఆ మార్క్ చూసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే 14వ రోజు మాత్రం రూ. కోటి షేర్ టార్గెట్ అందుకోలేకపోయింది. ఏదేమైనా.. 'ఆర్ ఆర్ ఆర్' తరువాతి స్థానంలో 'బేబి' నిలవడం అనూహ్యమే. మరి.. ఫుల్ రన్ లో 'బేబి' ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.