English | Telugu
పెళ్ళికి రెడీ అయిన అయ్యగారు!
Updated : Nov 24, 2023
కొత్త దర్శకుడు అర్మాన్ మెరుగు దర్శకత్వంలో ఏంజల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. వెంకట రమణ నిర్మిస్తున్న చిత్రం 'అయ్యగారు'. 'పెళ్ళికి రెడీ' అనేది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్రం గ్లింప్స్ ని ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. మంచి కామెడీ మరియు యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ లా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా దర్శకుడు, అర్మాన్ మెరుగు మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో హీరోగా నేనే నటిస్తున్నాను. అలాగే సంగీతం కూడా అందిస్తున్నాను. నేటి యువతకు అద్దం పట్టేలా ఒక సెన్సిటివ్ పాయింట్ ని ఎంటర్టైన్మెంట్ తో మిలితం చేసి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. అందరిని నవ్విస్తూ మనిషి యొక్క విలువలు చెప్పడమే మా సినిమా ముఖ్య ఉద్దేశం. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాం" అని అన్నారు.
నిర్మాత వెంకట రమణ మాట్లాడుతూ.. "దర్శకుడు అర్మాన్ చెప్పిన కథ నచ్చడం తో ఈ కథను ఎలాగైనా ప్రజల్లోకి తీసుకురావాలని నిర్మిస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాము" అన్నారు.
అర్మాన్ మెరుగు, సిద్ధి ఖన్నా, వెంకట రమణ, సునీల్ రావినూతల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సి. యస్ చంద్ర, ఎడిటర్ గా కేసీబీ హరి వ్యవహరిస్తున్నారు.