English | Telugu

స్టార్‌ హీరోయిన్‌ కుమార్తె పెళ్లికి సర్వం సిద్ధం!

హీరోయిన్‌ రాధ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అనే చెప్పాలి. 1980`90 దశకంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రాధ. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌ అయిపోయింది. తెలుగులో స్టార్‌ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించింది రాధ. 1983లో ‘శక్తి’ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. నటరత్న ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించింది. 1991లో రాజశేఖర్‌ నాయర్‌ను పెళ్లి చేసుకుంది రాధ. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి ముగ్గురు సంతానం. వారిలో కార్తీక, తులసి హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

ఇప్పుడు రాధ కుమార్తె కార్తీక వివాహం చేసుకోబోతోంది. అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అయితే పెళ్లికొడుకు ఎవరు అనేది ఇంతవరకు తెలియలేదు. మరికొద్దిరోజుల్లో పెళ్లి కూడా జరగబోతోంది. వివాహాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాధ సెలబ్రిటీలకు ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును కలిసి పెళ్లికి ఆహ్వానించింది రాధ.

ఇక కార్తీక సినిమా కెరీర్‌ గురించి చెప్పాలంటే... నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా ‘జోష్‌’లో కార్తీక హీరోయిన్‌. ఈ సినిమా సక్సెస్‌ కాకపోవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత జీవా హీరోగా కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘కో’లో హీరోయిన్‌గా నటించింది కార్తీక. ఈ సినిమా ‘రంగం’ పేరుతో తెలుగులోకి అనువదించబడిరది. ఈ సినిమాల రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ‘దమ్ము’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి’తోపాటు తమిళ్‌లో ఓ సినిమా చేసింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి బిజినెస్‌ రంగంలో అడుగుపెట్టింది. యుటిఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ నిర్వహిస్తున్న కార్తీక ఆ గ్రూప్‌కి డైరెక్టర్‌గా కొనసాగాలని నిర్ణయించుకుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.