English | Telugu
హీరోయిన్ అనుష్కకి అరుదైన వ్యాధి!
Updated : Feb 14, 2023
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన హీరోయిన్ స్వీటీ అనుష్క అలియాస్ అనుష్క శెట్టి. ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఇప్పటికీ తన సత్తా చాటుతూనే ఉంది. 2005లో ఈమె నటించిన మొదటి చిత్రం సూపర్ చిత్రం విడుదల అయింది. అంటే దాదాపు 18ఏళ్లుగా ఈమె సినీ ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. కోలీవుడ్‌లో సైతం ఇదే తరహాలో సూపర్ స్టార్స్ తో కలిసి నటించింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా కూడా తన సత్తా చాటింది. అరుంధతి ,పంచాక్షరి, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి నిశ్శబ్దం వంటి చిత్రాలలో నటించింది. తాజాగా అనుష్క తనకు ఉన్న ఒక వీక్నెస్ ను రోగంగా భావిస్తుందట ఈ విషయమై ఆమె మాట్లాడుతూ ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే ఏకధాటిగా 15, 20 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటాను.
ఇదే నా సమస్య అని చెప్పుకొచ్చింది. నవ్వించే సన్నివేశం వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. నేను నవ్వడం మొదలు పెడితే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాల్సిందే. గ్యాప్ లేకుండా 15 నుంచి 20 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా నవ్వుతూ ఉంటాను. ఈ గ్యాప్ లో ప్రొడక్షన్ వాళ్ళు టిఫిన్ స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకుని వస్తారు అని అనుష్క చెప్పుకొచ్చింది. అయితే ఈ వార్త విన్న అనుష్క అభిమానులు మాత్రం నవ్వడం ఆరోగ్యానికి మంచిదేగా స్వీటీ అంటున్నారు.
ఈమె యోగ టీచర్ కూడా కావడంతో లాఫింగ్ క్లబ్బులలో చేరడం వల్ల ఇలా ఆమె నాన్స్టాప్‌గా నవ్వడం జరుగుతూ ఉండవచ్చు. ఇలా ఆమెకు నవ్వడం అలవాటై ఉంటుంది. కాగా నిశ్శబ్దం తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది ప్రస్తుతం జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా యువి ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న రొమాంటిక్ మూవీలో నటిస్తోంది. మిస్ శెట్టి.... మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట.