English | Telugu
మహేష్ కాదన్నా సత్తా నిరూపించుకుంటున్నారు!
Updated : Feb 14, 2023
బాలీవుడ్ లో దర్శకద్వయం రాజ్ అండ్ డీకే లకు మంచి గుర్తింపు ఉంది. వీరు వెబ్ సిరీస్ల ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యారు. రాజు అండ్ డీకే ది ఫ్యామిలీ మెన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తెలుగులో అప్పుడెప్పుడో డి ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని తీశారు. ఆ చిత్రానికి వారు నిర్మాతలుగా వ్యవహరించారు. వారికి దర్శకునిగా అవకాశం ఇస్తానని మహేష్ బాబు నాడు మాట ఇచ్చారు. దాని కోసం వారు ఎంతో కాలం మహేష్ కోసం వెయిట్ చేశారు. కానీ డి ఫర్ దోపిడీ తర్వాత రాజ్-డికే లను మహేష్ పట్టించుకోలేదు. దాంతో వాళ్లు కూడా వెబ్ సిరీస్ లు బాలీవుడ్ చిత్రాలపై దృష్టి కేంద్రీకరించారు. ఆమద్య వీరు సమంతాతో చేసిన ది ఫ్యామిలీ మెన్ సిరీస్ తో మరింత పాపులర్ అయ్యారు.
ప్రస్తుతం వీరు రూపొందించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఫోర్జి సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, రెజీనా కేకే మీనన్ కీలక పాత్రలో పోషించారు. నకిలీ నోట్లు తయారు చేసే వ్యక్తిగా షాహిద్ కపూర్ కనిపించారు. అతని పట్టుకునే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా విజయ్ సేతుపతి నటించారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడం మొదలైంది. విజయ్ సేతుపతి పాత్ర సీరియస్గా కనిపిస్తూ తనదైన స్టైల్ లో కామెడీని కూడా పండించడం విశేషం. సిరీస్ కాస్త స్లో గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి రెజీనా భార్యాభర్తలుగా నటించారు. వీరి మధ్య సంభాషణలు బాగా ఆకట్టుకుంటున్నాయి. రెజీనా తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగల యువతిగా కనిపించింది.
అయితే ఇక్కడ విజయ్ సేతుపతి రెజీనా మధ్య సాగే సంభాషణలలో ప్రధానంగా తెలుగును వినిపించేలా దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో వారికి తెలుగు ఇండస్ట్రీపై ఉన్న నమ్మకం, ప్రేమ, ఇష్టం అర్థమవుతుంది. హిందీ సీరిస్ లో తెలుగు డైలాగులు వినిపించడంతో తెలుగువారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు స్టార్స్ తోను సినిమాలు చేయాలని సీరిస్ లను తెరకెక్కించాలని ఈ దర్శకద్వయం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం వీరు సమంతాతో సీటాడెల్ సిరీస్ ను రూపొందిస్తున్నారు.