English | Telugu

పుష్పరాజ్ ప్రపంచంలోకి షీలావతి

అగ్ర హీరోయిన్ 'అనుష్క'(Anushka)ఈ నెల 5 న 'ఘాటీ'(Ghaati)తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కగా, అనుష్క కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది. దర్శకుడు క్రిష్(Krish Jagarlamjudi)వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటు ఘాటీ గురించి, అందులోని అనుష్క నటన గురించి చెప్పుకొస్తున్న విషయాలతో 'ఘాటీ' పై అంచనాలు అంతకంత పెరిగాయి. అనుష్క గంజాయి స్మగ్లింగ్ చేసే 'షీలావతి' క్యారక్టర్ లో కనిపిస్తుంది. ఆ తర్వాత తాను చేస్తున్న పని తప్పని తెలుసుకొని గంజాయి ముఠాని ఏ విధంగా నిర్మూలించిందనే పాయింట్ తో 'ఘాటీ' తెరకెక్కింది.

కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో 'పుష్ప' (Pushpa)సిరీస్ లోని ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)నటనకి, ఘాటీ లోని అనుష్క నటనని పోలుస్తు పోస్ట్ లు కనపడుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా పుష్ప రాజ్, షీలావతి లు స్మగ్లింగ్ పై తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఈ ఇద్దరు క్రిష్ దర్సకత్వంలోనే వచ్చిన 'వేదం' మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఘాటీలో విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు, జిష్ణు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషించగా ఫస్ట్ ఫేమ్ ఎంటర్ టైన్ మెంట్ పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్ అయితే రికార్డు వ్యూస్ తో దూసుపోతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.