English | Telugu
‘పుష్ప 2’ నుంచి ఫోటో లీక్ లీక్.. వందకు పైగా లారీలు
Updated : Sep 7, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా సుకుమార్ సినిమాను ప్లాన్ చేశారు. అందులో మొదటి భాగంగా ‘పుష్ప ది రైజ్’ మూవీ. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఇది ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేయటంతో పాటు అల్లు అర్జున్ డాన్స్, మేనరిజమ్ తెగ వైరల్ అయ్యింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం రీల్స్ చేయటంతో పుష్ప సినిమా క్రేజ్ పీక్స్‌కి చేరుకుంది. దీంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంతే కాకుండా రీసెంట్‌గా పుష్ప ది రైజ్‌లో నటనకుగానూ అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ నటుడు అవార్డుని సొంతం చేసుకున్నారు. ఆల్ రెడీ పుష్ప సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఈ అంచనాలను అందుకునేలా సుకుమార్ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా పుష్ప 2 సెట్స్ నుంచి ఫొటోలు కొన్ని లీక్ అయ్యాయి. అందులో లారీలు ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలో వందకు పైగా లారీలున్నాయి. ఈ పిక్ చూస్తుంటే సుకుమార్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. ముత్తం శెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో పుష్ప ది రూల్ సినిమాను విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.