English | Telugu

సచిన్ కు లవర్ దొరికింది

హిందీలో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం "ఆషికీ 2". ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో హీరోగా "మౌనమేలనోయి" ఫేం సచిన్ జోషి నటించనున్నాడు. ఈ చిత్రంలో సచిన్ సరసన హీరోయిన్ గా నటించమని కాజల్ అగర్వాల్, తమన్నా వంటి టాప్ హీరోయిన్లను సంప్రదించారు. కానీ వారు ఈ సినిమాను చేయడానికి అంగీకరించలేదు. అయితే ఫైనల్ గా అంకిత షోరేను హీరోయిన్ గా ఎంపిక చేసారు. మరి ఈ అమ్మడు ఎంతవరకు జనాలకు పిచ్చేక్కిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి రవీంద్ర దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.