English | Telugu

రాత్రికి రాత్రి ముంబై నుంచి జంప్ అయిన రష్మిక..కారణం ఇదే 

నేషనల్ క్రష్ రష్మిక యానిమల్ హిట్ తో మంచి జోరుమీద ఉంది.యానిమల్ ముందు వరకు వరుస ప్లాపులతో ఉన్న ఈ ముద్దుగుమ్మ యానిమల్ తో భారీ హిట్ అందుకొని ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందింది. అలాగే ఎప్పుడు లేని విధంగా ఆ మూవీలో ఎంతో డేర్ గా రణబీర్ తో కలిసి రొమాన్స్ సీన్స్ చేసిన రష్మిక ఇప్పుడు హఠాత్తుగా ముంబై నుంచి మాయం అయ్యింది.

రష్మిక నిన్న నైట్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ మరికొందరి భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో రష్మిక టైటిల్ రోల్ పోషిస్తుంది.ఇప్పుడు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది. ఇరవై రోజులు పాటు హైదరాబాద్ లో జరిగే ఈ షెడ్యూల్ లో రష్మిక ఏకధాటిగా పాల్గొనబోతుంది. అంటే రష్మిక ఇక ఇరవై రోజులు హైదరాబాద్ లోనే మకాం వేయనుంది. చి.ల.సౌ, మన్మథుడు 2తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

రష్మిక యానిమల్ ప్రమోషన్స్ నిమిత్తం ఢిల్లీ, ముంబై, బెంగుళూరు,చెన్నై, హైద్రాబాద్, కొచ్చి లాంటి ఏరియాలన్నివారం రోజులు పాటు చుట్టేసి వచ్చింది. యానిమల్ మూవీ సక్సెస్ రష్మిక కి మంచి బూస్టప్ ని ఇచ్చింది.అలాగే రష్మిక పుష్ప 2 లో కూడా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ లో కూడా ఆమె త్వరలోనే పాల్గొంటుంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.