English | Telugu

మళ్ళీ నా వర్కౌట్ ప్లేస్ కి వచ్చేసానోచ్...

అనసూయ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఎందుకంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటూ ఎవరు ఎమన్నా ధమ్కీ ఇవ్వకుండా మాత్రం వెనక్కి తగ్గనే తగ్గదు. చీర కట్టిన, మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నా ఆమె అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి ఆటిట్యూడ్ అనసూయది. ఐతే ఆమె ఈ మధ్య ఆమె మూవీ షూటింగ్స్ తో చాలా బిజీ ఐపోయింది. 'పుష్ప2' మూవీ షూటింగ్‌ ఎక్కువగా నైట్ టైంలో జరుగుతోందంటూ అందులో తాను పాల్గొంటున్నట్లు ఆమె తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా చెప్పింది.

బుల్లితెరని వదిలి బిగ్ స్క్రీన్ మీదకు వెళ్ళాక ఆమెకు అసలు తీరికే ఉండడం లేదు. అలాంటి అనసూయ ఇప్పుడు మళ్ళీ తన వర్క్ ప్లేస్ కి వచ్చేసింది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని షూ వేసుకుని అలవాటుగా ఫోటో తీసుకుంటూ కనిపించింది. ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుని "మోటివేషన్ అనేది మనల్ని మళ్ళీ స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. అలవాటు అనేది నిరంతరం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. 14 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత నేను నా వర్కౌట్ ప్రాంతానికి చేరుకున్నందుకు సంతోషిస్తున్నాను. సరిగా నిద్ర లేక ఎంతో స్ట్రైన్ అవుతున్నా" అని చెప్పింది.

అనసూయ.. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీబిజీగా ఉంది అనసూయ. అందులో 'పుష్ప2'తోపాటు 'సింబా', తమిళంలో ఓ మూవీ చేస్తోంది, తెలుగులోనూ మరో రెండు మూడు చిత్రాల్లోనూ నటించబోతోంది. ఐతే వాటికి సంబంధించిన ప్రకటనలు రావాల్సి ఉంది. ఇకపోతే అనసూయ రీసెంట్ గా 'విమానం'లో ప్రాస్టిట్యూట్ రోల్ లో అద్భుతంగా నటించింది. ఈ మూవీ ఇప్పుడు ఓటిటి మీద మంచి వ్యూస్ ని సంపాదించుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ ఫిజిక్ విషయంలో కూడా బాగా కేరింగ్ తీసుకుంటూ ఉంటుంది. జిమ్ములో గంటలు తరబడి కష్టపడి బాగా వర్కౌట్స్ చేస్తూ వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది అనసూయ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.