English | Telugu

విజయ్ తో చౌదరి గారి అమ్మాయి



ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ లుక్కియెస్ట్ హీరోయిన్ ఎవరని చర్చకి వస్తే అందరు మీనాక్షి చౌదరి అని చెప్పాలసిందే. తెలుగు లో అగ్ర హీరోలుతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న మీనాక్షి తాజాగా తమిళ సినీ పరిశ్రమకి చెందిన అగ్ర హీరోతో నటించే అవకాశం పొంది టోటల్ ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం తన వైపు చూసేలా చేసుకుంది.

మీనాక్షి చౌదరి తెలుగులో రెండు పార్టు లతో వచ్చిన హిట్ మూవీ పార్ట్ 2 ,ఖిలాడీ,తమిళంలో విజయ్ ఆంథోనీ సరసన కొలాయ్ ఇలా పలు సినిమాల్లో నటించి అందానికి అందంతో పాటు మంచి ఈజ్ ఉన్న నటీమణి అని గుర్తింపు తెచ్చుకుంది.ఇపుడు గుంటూరు కారం ,సలార్ లాంటి అగ్ర హీరోల సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ హోదాలో ముందుకు దూసుకుపోతుంది. తాజాగా మీనాక్షి ఇండియన్ సినిమా అగ్ర హీరోల్లో ఒకరైన హీరో పక్కన నటిస్తుందనే ఒక న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.ఇళయ దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.ఆయన పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చాలు ఇంక ఆ హీరోయిన్ కెరియర్ ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా జెట్ స్పీడ్ వేగంతో సాగుతుంది.ఎందుకంటే విజయ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.దీంతో ఆ హీరోయిన్ అందరి గుండెల్లో కొలువుతీరి ఉంటుంది. విజయ్ తన నెక్స్ట్ మూవీని వెంకట్ ప్రభు దర్శకత్వం లో చేస్తున్నాడని అఫిషియల్ గా ఒక ప్రకటన కూడా వచ్చింది.ఇప్పుడు ఆ మూవీలోనే విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించబోతుంది.పైగా ఈ విషయాన్ని విజయ్ ఫాన్స్ తమ సోషల్ మీడియాల్లో వెల్లడి చేస్తుండటం గమనార్హం.ఏది ఏమైనా మీనాక్షి చౌదరి దశ తిరిగినట్లే అని అందరు అంటున్నారు.