English | Telugu
బెంగళూరులో మహేష్ బిజినెస్ డీటైల్స్
Updated : Sep 17, 2023
సూపర్‌స్టార్ మహేష్ కేవలం సినిమాలకే పరిమితం కావటం లేదు. ఆయన తను సంపాదించిన మొత్తాన్ని పలు వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తన బ్రాండ్ విలువను పెంచుకుంటూ వస్తున్నారు. పలు కమర్షియల్ ప్రకటనల్లో నటిస్తున్నారు. కమర్షియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటి తరం హీరోల్లో ఆయన చేసినన్ని యాడ్స్‌లో ఎవరూ నటించలేదు. ఇక మహేష్ చేస్తున్న వ్యాపారాల విషయానికి వస్తే టెక్స్‌టైల్స్, సినిమా మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్ ఇలా పలు వాటిలో మహేష్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు మహేష్ తన ఎఎంబీ సినిమాస్ బిజినెస్‌ను విస్తృతం చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన బెంగుళూరులో ఎఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను కట్టిస్తున్నారట. త్వరలోనే దాని ఓపెనింగ్ ఉంటుందని అంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ హీరోగా నటిస్తోన్న చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ జవనరి 12న రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష్స్ ఉన్నాయి. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న సినిమా ఇది. సూపర్‌స్టార్‌ను సరికొత్త మాస్ కోణంలో మూవీ ఎలివేట్ చేయనుందని సమాచారం. ఈ సినిమా కోసం మన స్టార్ హీరో సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం.
గుంటూరు కారం మూవీ తర్వాత మహేష్‌తో రాజమౌళి సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే జక్కన్న దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఇండియా జోన్స్ స్టైల్లో మహేష్‌తో యాక్షన్ అడ్వెంచరస్ సినిమాను తెరకెక్కిస్తానని ఇప్పటికే దర్శకధీరుడు ప్లాన్ చేస్తున్నారు.