English | Telugu

అఖిల్‌కి సోషియా ఫాంట‌సీ స్టోరీ?

వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ ఎంట్రీ ఖ‌రారైపోయి చాలా రోజులైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అన్న‌పూర్ణ కాంపౌండ్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన సంగ‌తులేం బ‌య‌ట‌కు రాలేదు. క‌థ విష‌యంలో ఓ క్లారిటీ ఇచ్చాక‌.. అన్ని వివ‌రాలూ ఒకేసారి మీడియాకు చెప్పేయాల‌ని వినాయ‌క్ - నాగార్జున భావిస్తున్నారు. వినాయ‌క్ ప్ర‌స్తుతం కోన‌వెంక‌ట్‌, గోపీమోహ‌న్ ల‌తో కుస్తీలు ప‌డుతున్నారు. అఖిల్ స్టోరీ విష‌యంలో ఓ క్లూ దొరికింది. ఇదో సోషియో ఫాంట‌సీ క‌థ అట‌. మాయ‌లూ, మంత్రాల నేప‌థ్యంలో సాగే సినిమా అని తెలిసింది. ఈ జోన‌ర్‌లో వినాయ‌క్ ఎప్పుడూ సినిమా చేయ‌లేదు. సో.. త‌న‌కి ఈ లైన్ కొత్త‌గా ఉంటుంద‌ని భావించాడ‌ట‌. అఖిల్ టాలెంట్లు పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శించే క‌థ ఇద‌ని అటు నాగార్జున కూడా న‌మ్ముతున్నాడ‌ట‌. అంతే కాదు.. ఈసినిమాలో నాగార్జున కెరీర్‌లో ఆల్ టైమ్ హిట్ గీతాన్ని రీమిక్స్ చేయాల‌ని టీమ్ భావిస్తోంద‌ని స‌మాచార‌మ్‌. డిసెంబ‌రులో ఈ సినిమాఎట్టిప‌రిస్థితుల్లోనూ సెట్స్‌పైకి వెళ్ల‌డం ఖాయంలా అనిపిస్తోంది. ఈ నెలాఖ‌రులోగా ఈసినిమాకి సంబందించిన పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.