English | Telugu

కృష్ణ‌వంశీ - ప్ర‌కాష్ రాజ్ - దిల్‌రాజు సినిమా

కృష్ణ‌వంశీ - ప్ర‌కాష్‌రాజ్‌ల మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. కృష్ణ‌వంశీ త‌న సినిమాల్లో ప్ర‌కాష్‌రాజ్‌కి గొప్ప పాత్ర‌ల్ని డిజైన్ చేశాడు. మ‌ధ్య‌లో ఎందుకో.. వీళ్లిద్ద‌రి అనుబంధానికి బ్రేక్ ప‌డింది. గోవిందుడు అంద‌రివాడేలేతో మ‌ళ్లీ ఈ ఫ్రెండ్‌షిప్‌కి చిగుర్లు వేశాయి. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తోంది. అయితే ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్ న‌టుడు కాదు. నిర్మాత‌. త‌న డ్యూయోట్ మూవీస్ ప‌తాకంపై కృష్ణ‌వంశీతో ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు ప్ర‌కాష్ రాజ్‌. ఇందులో దిల్‌రాజు కూడా నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటారు. అంద‌రూ కొత్త వాళ్లే న‌టించే ఈ సినిమా కోసం క‌థ సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ సినిమా సంగ‌తుల్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ఓ గొప్ప ద‌ర్శ‌కుడు, జాతీయ స్థాయి ఉత్తమ న‌టుడు, నిర్మాణ విలువ‌ల‌కు పేరెన్న‌ద‌గిన నిర్మాత క‌ల‌సి రూపొందించే ఈ చిత్రం ఎలా ఉంటుందో...?! ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో..??

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.