English | Telugu

వృషభ ఎండింగ్ కలెక్షన్స్ ఇవేనా! ఫస్ట్ వీక్ ఎంత

-ఇప్పటి వరకు ఎంత
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-క్లోజింగ్ కి వచ్చినట్టేనా!


సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో మోహన్ లాల్(Mohanlal)కూడా ఒకరని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 80 వ దశకం నుంచే సదరు సౌత్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి 'క్రిస్ మస్'(Christmas)కానుకుగా 'వృషభ'(Vrusshabha)తో అడుగుపెట్టాడు. కానీ వృషభ అభిమానులతో పాటు అందరి అంచనాలని తలకిందులు చేస్తు డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. సదరు డిజాస్టర్ టాక్ కి ఫలితం ఎలా ఉందంటే మోహన్ లాల్ కెరీర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా ఆవిష్కృతమైంది . దీంతో ట్రేడ్ వర్గాల వారు వృషభ ఇప్పటి వరకు రాబట్టిన కలెక్షన్స్ కి సంబంధించి వెల్లడి చేసిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.


వృషభ ఇప్పటి వరకు కేవలం రెండు కోట్ల రూపాయల నెట్ ని మాత్రమే రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు కోట్లలో మొదటి రోజే డెబ్భై లక్షలు వచ్చాయని వెల్లడి చేసాయి. అంటే ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ఊహించుకోవచ్చు. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ రావడంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా చాలా థియేటర్స్ లో ప్రెజెంట్ వృషభ రన్ అవ్వడం లేదు. కేరళలో కూడా చాలా థియేటర్స్ నుంచి తప్పించడంతో రెండు కోట్ల రూపాయలని ఎండింగ్ కలెక్షన్స్ గా భావించవచ్చు. ఇక మోహన్ లాల్ అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు వరుస విజయాలతో దూసుకుపోతున్న తమ అభిమాన హీరో సినిమాకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కనీస స్థాయి కలెక్షన్స్ రాబట్టలేకపోవడం తమని ఆవేదనకి గురి చేస్తుందని అంటున్నారు.


Also Read: సంక్రాంతికి గెలిచేది ఈ చిత్రమే.. పేరు ఇదే


పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన వృషభ లో రాజా విజయేంద్ర వృషభ అనే మహారాజుగా, అది దేవవర్మ అనే బిజినెస్ గా మోహన్ లాల్ భిన్న పార్శ్యాలు ఉన్న క్యారక్టర్ లలో కనిపించాడు. తన పెర్ ఫార్మెన్స్ తో కట్టిపడేసినా కూడా కథ, కథనాల్లోని లోపాలు, నంద కిషోర్(Nanda Kishore)పసలేని దర్శకత్వం బాక్స్ ఆఫీస్ వద్ద వృషభ ని ముందుకు తీసుకెళ్లలేకపోయాయి.నయన్ సారిక, రాగిణి ద్వివేది హీరోయిన్ లుగా చేసారు. కనెక్ట్ మీడియా, బాలాజీ మోషన్ పిక్చర్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం